Wednesday, April 30, 2025
Homeసినిమామరోసారి శర్వాకి జోడీగా..

మరోసారి శర్వాకి జోడీగా..

శర్వానంద్‌ నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ని ప్రారంభించడానికి మేకర్స్‌ సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రానికి సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కెకె రాధామోహన్‌ నిర్మిస్తుండగా, లక్ష్మీ రాధామోహన్‌ సమర్పిస్తున్నారు.
‘శతమానంభవతి’ సినిమా తర్వాత ఈ చిత్రంలో శర్వా సరసన హీరోయిన్‌గా నటించడానికి అనుపమ పరమేశ్వరన్‌ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. కథలో అనుపమ పాత్ర చాలా కీలకంగా ఉండబోతోంది. అనౌన్స్‌ మెంట్‌ పోస్టర్‌లో అనుపమ రగ్డ్‌ ఇంటెన్స్‌ అవతార్‌లో 1960ల నాటి సినిమా వరల్డ్‌కి సరిపోయేలా దుస్తులు ధరించి కనిపించారు. పోస్టర్‌ ఆమె పాత్ర కథాంశానికి తీసుకువచ్చే బలం, సంక్లిష్టత గురించి తెలిజేస్తోంది. 1960ల చివరలో ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో సెట్‌ చేయబడిన ఈ చిత్రం ప్రేక్షకులను మరపురాని అనుభూతిని అందించబోతోంది. ఈ చిత్రం హై-స్టేక్స్‌ పీరియడ్‌ యాక్షన్‌ డ్రామాగా ఉండబోతోంది. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img