నవతెలంగాణ-కుభీర్ : మండలంలోని నిగ్వ గ్రామ సమీపంలో నీ గాడ్డెన్న వాగులో పడి సోమవారం మృతి చెందారు. పోలీసులు కుటుంబ సభ్యులు తెలపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర లోని కొల్గం జాదవ్ మోహన్ 45 అనే వ్యక్తి నిగ్వ గ్రామానికి వ్యవసాయ పనుల కొరకు ఇటీవల కుటుంబ సభ్యులతో వలస వచ్చి నివసిస్తున్నారు ఈ క్రమంలో ఆదివారం ఉదయం వ్యవసాయ క్షేత్రలకు గేదెలు మేత మేపడానికి తీసుకువెళ్లారు. సాయంత్రం అయినప్పటికీ ఇంటికి రాకపోవడం తో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు వెతకగా ఆచూకీ లభించకపోవడంతో సోమవారం ఉదయం గడ్డెన్న వాగు ప్రాజెక్టు వద్దకు వెళ్లి వెతకగా వాగు వద్ద మోహన్ వేసుకున్న దుస్తులు కనిపించడంతో అనుమానంతో వాగులో వెతికించారు. మోహన్ మృతదేయం లభించడం జరిగిందని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు మృతుడికి భార్య పిల్లలు ఉన్నారు మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు
ప్రమాధవ శాత్తు సుద్ద వాగులో పడి ఒక్కరు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



