– కొణిజర్ల,కల్లూరు,పెనుబల్లి,దమ్మపేట జంక్షన్ లను ఆధునీకరించండి
– 4 లైన్లు రహదారి, డివైడర్, సెంట్రల్ లైటింగ్, డ్రైన్ లు మెరుగుపరచాలి
– కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి తుమ్మల లేఖ
– సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి గడ్కరీ
నవతెలంగాణ – అశ్వారావుపేట : కేంద్ర ఉపరితల రవాణా,జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు.అనంతరం ఆయన కేంద్రమంత్రి తో ఫోన్లో మాట్లాడారు. ఖమ్మం – అశ్వారావుపేట జాతీయ రహదారిపై అత్యవసరంగా వన్ టైం ఇంప్రూవ్మెంట్ (రెన్యువల్) పనులు తక్షణమే చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరారు.
ఇప్పటికే ఈ రహదారి నాలుగు లైన్లు గా విస్తరించేందుకు డీపీఆర్ సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఆ పనులు ప్రారంభం కావాలంటే సంవత్సరం సమయం పడుతుందని లేఖలో పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ రోడ్డు వర్షాల కారణంగా గుంతలు ఏర్పడి అధ్వానంగా ఉందని ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి లేఖలో ప్రస్తావించారు.
ఖమ్మం – అశ్వారావుపేట రోడ్ ను వన్ టైం ఇంప్రూవ్మెంట్ చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



