Saturday, February 28, 2026
E-PAPER
Homeఖమ్మంకొనసాగుతున్న ఎన్ఎస్ఎస్ శిబిరం 

కొనసాగుతున్న ఎన్ఎస్ఎస్ శిబిరం 

- Advertisement -

– విలువ ఆధారిత ఉత్పత్తులపై శిక్షణ 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

స్థానిక వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జె.హేమంత కుమార్ ఆధ్వర్యంలో మండలంలోని మల్లాయిగూడెంలో జాతీయ సేవా పథకం – ప్రత్యేక శిబిరం మూడవ రోజులో భాగంగా శనివారం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు స్వచ్ఛత ప్రోగ్రాం నిర్వహించారు.అందులో భాగంగా ప్లాస్టిక్ కలెక్షన్ పాయింట్లని గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది.

అనంతరం వారు గ్రామీణ మహిళలకు విలువ ఆధారిత ఉత్పత్తుల పైన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సొరకాయతో అప్పాలు మరియు పాయసం, పుట్టగొడుగులతో పకోడీ తయారు చేయడం జరిగింది. గ్రామంలో మహిళలు జీవ ప్రాజెక్ట్ లో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన చిరుధాన్యాలతో పకోడీ, పాయసం మరియు కిచిడి వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసారు. 

ఈ కార్యక్రమంలో వాలంటీర్లు ఈ వంటకాలలో పోషక విలువలని మరియు వాటి ప్రాముఖ్యతను గురించి వివరించారు.అనంతరం వీరు గ్రామంలో జీవ ప్రాజెక్ట్ లోని ప్రకృతి వ్యవసాయం లో చీడపీడల నిర్మూలనకై తయారు చేయబడే కషాయాల తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.తదుపరి ఈ గ్రామంలో వారు నాటక ప్రదర్శన మరియు నృత్య ప్రదర్శనలు చేసి గ్రామాల్లో రైతులకు చేరువ అయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డి.స్రవంతి,డాక్టర్ ఝాన్సీ రాణి, డాక్టర్ శ్రీజన్ లు నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -