- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఉల్లి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. తెలంగాణలో కిలోకు రూ.5-16 మాత్రమే దక్కుతోంది. వినియోగదారులకు మాత్రం రూ.25-45 మధ్య లభిస్తోంది. ఫలితంగా మధ్యవర్తులే లాభపడుతున్నారు. ఏపీలో క్వింటా కనిష్ఠంగా రూ.501, గరిష్ఠంగా రూ.1,249 పలుకుతోంది. రైతుకు కేజీకి రూ.5-12 మధ్యే దక్కుతోంది. కొన్ని మార్కెట్లలో ఉల్లి నిల్వలు పేరుకుపోయి కొనుగోళ్లూ నిలిచిపోయాయి. ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
- Advertisement -