నవతెలంగాణ – డిచ్ పల్లి: తెలంగాణ యూనివర్సిటీ వృక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నవంబర్ 6న జరిగే ఐ పి ఆర్ అంతర్జాల కార్యశాల కరపత్రం ను తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు గురువారం తన చాంబర్లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు ‘మేధో సంపత్తి హక్కులు, పేటెంట్’ పై జరిగే ఈ కార్యశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యశాలకు రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ కు చెందిన అసిస్టెంట్ కంట్రోలర్ డాక్టర్ భరత్ సూర్యవంశీ కీలకోపన్యాసం ఇస్తారన్నారు.కార్యాశాల నిర్వాహకులు వృక్షశాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ అహ్మద్ అబ్దుల్ హలీం ఖాన్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తారు.వర్తమాన సమాజంలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ పెటెంట్స్ అండ్ డిజైన్ ఫిల్లింగ్ అనే అంశంపై జరిగే ఈ కార్యాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఎం. అరుణ, ప్రొఫెసర్ బి. విద్యావర్ధిని, డాక్టర్ డి. శ్రీనివాస్, డాక్టర్ వి. జలంధర్ తదితరులు పాల్గొన్నారు.
నవంబర్ 6న ఐపిఆర్ పై ఆన్లైన్ కార్యశాల కరపత్రం ఆవిష్కరణ..
- Advertisement -
- Advertisement -



