నవతెలంగాణ-హైదరాబాద్: ప్రపంచంతోపాటు దేశంలో ఫాసిస్టు శక్తులను అడ్డుకునేది కేవలం కమ్యూనిష్టులేనని సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి అన్నారు. చండీగఢ్ లో జరుగుతున్న సీపీఐ జాతీయ మహాసభలకు బేబీ సౌహర్థ ప్రతినిధిగా హాజరయ్యారు. జాతీయ మహాసభలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ… రానున్న రోజుల్లో ప్రజాస్వామ్య వాదులను కలుపుకొని వామపక్షాలు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ సంపదను దోపిడీ చేసేందుకు క్యాపిటలిస్టులు కొత్త దారులు వెతుకుతున్నారని, వాటిని నిలువరించే క్రమంలో ప్రజలను అప్రమత్తం చేసే బాధ్యత కమ్యూనిష్టులదని ఆయన సూచించారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్బగా ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ చేసిన ప్రసంగం అసహనం కలిగించిదన్నారు. ఫ్రీడం మూవ్ మెంట్‌లో ఎలాంటి తొడ్పాటు అందించని ఆర్ఎస్ఎస్ గురించి ప్రధాని ప్రస్తావించడం ఆశ్యర్యాన్ని కలిగించిదన్నారు. ఆర్ఎస్‌ఎస్ దేశానికి గొప్ప సేవ చేసిందని మోడీ ఏలా చెప్పుతారని ఆయన మండిపడ్డారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆర్ఎస్ఎస్‌ను ఉపప్రధాని సర్థార్ వల్లబాయ్ పటేల్ బ్యాన్ చేశారనే విషయం ప్రధానికి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి వీడీ సావర్కర్ ఆంగ్లేయలను ప్రార్థించారని, అలాంటి వ్యక్తులను బీజేపీ స్మరించుకోవడం ఏంటని ప్రశ్నించారు. జాతి పిత మహాత్మాగాంధీని హత్య చేసిన కేసులో ఆయనే ప్రధాన కుట్రదారుడని ప్రస్తుత ప్రపంచానికి తెలుసు అని ఆయన గుర్తు చేశారు. ఆర్‌స్సెస్ చేతిలో మోడీ ప్రభుత్వం కీలుబొమ్మ అయిందని మండిపడ్డారు. దేశ కోసం ప్రాణాలను త్యాగం చేసిన భగత్ సింగ్ గురించి ఎందుకు ప్రస్తావించలేదని ఎంఏ బేబి ప్రశ్నించారు. లెనిన్ స్పూర్తితో భగత్ సింగ్ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర షోషించారని, కమ్యూనిష్టు పంథాలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం సాగించారని తెలియజేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్..త్రీబుల్ టి.ఫార్మాలను పాటిస్తున్నారని ధ్వజమోత్తారు. టారిఫ్- టెర్రరిజం-ట్రంప్ అనే ధోరణిలో భారత్ పై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. సాధారణ సుంకాలతో పాటు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందని ఇండియాపై అదనంగా 25శాతం సుంకాలు విధించారని, మొత్తంగా 50శాతం భారత్ దిగుమతులపై టారిఫ్‌లు విధించారని వివరించారు. అంతేకాకుండా యూరోపియన్ దేశాలు కూడా ట్రేడ్ వార్ లో భాగస్వామ్యం కావాలని ఆయా దేశాలపై ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు. అమెరికా సుంకాలను ధిక్కరించిన బ్రెజిల్ పై కూడా కక్ష పెంచుకున్నారని, ఆ దేశ న్యాయవ్యవస్థపై కూడా ట్రంప్ దాడికి యత్నించారని మండిపడ్డారు. యూఎస్ అనుకూల మాజీ ప్రెసిడెంట్ బోర్సినారోను రక్షించడానికి..ఆ దేశ జడ్జిల యూఎస్ వీసాలను రద్దు చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా బ్రిక్స్-షాంఘై కూటములపై ట్రంప్ తన అక్కసును వెళ్లగక్కారు. ఇండియా-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని..ఇప్పటికే 41సార్లు చెప్పారని, తనకు నోబెల్ శాంతి ప్రకటించాలని ఆయనకు ఆయనే డిమాండ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ట్రంప్ ధోరణి చూస్తుంటే..అమెరికా ప్రెసిడెంట్ అనే విషయాన్ని మరిచిపోయి ప్రపంచమొత్తానికి కింగ్ లా భావిస్తున్నాడని విమర్శించారు.
అదే విధంగా ఎన్నికల సంఘం అధికార పార్టీ బీజేపీకి టూల్ కిట్టులా వ్యవహరిస్తుందని, అందుకు నిదర్శనం ఇటీవల బీహార్ లో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియే అని గుర్తు చేశారు. బీహార్ తో పాటు బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడులో ఎలక్షన్స్ జరగనున్నాయని, వామపక్షాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయా రాష్ట్రాల్లో కమ్యూనిష్టులు ప్రాబల్యం చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు. అందుకు అనుగుణంగా ఇప్పటినుంచి వామపక్షాలు సన్నద్ధం కావాలి పిలుపునిచ్చారు.
బీజేపీ పాలనలో ఆదివాసీ భూములకు రక్షణ లేకుండా పోతుందని విమర్శించారు. ఆరో షెడ్యూల్ లో కల్పించిన రక్షణలను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. ఆదివాసీ భూములతో పాటు విలువైన సహజ వనరులను దోపిడీ చేయడానికి ఆదానీ, అంబానీలకు అప్పన్నంగా వారి భూములను అప్పగిస్తున్నారని ఆరోపించారు. ఈ తరహా దోపిడీల గురించి ప్రజలకు తెలియజేయడంలో ప్రస్తుత మీడియా విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వామపక్షాలు ఐక్యంగా ఫాసిష్టు శక్తులను అడ్డుకోవాలని, అందుకు వ్యహాత్మంగా వ్యవహరించాలని సూచించారు.
కమ్యూనిష్టుల పాలనకు నిదర్శనం కేరళ అని కొనియాడారు. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు పకబ్బంధీగా అమలు చేస్తుందని, పారదర్శకతో అర్హులైన పేదలకు ప్రభుత్వం స్కీంలు అందుతున్నాయని చెప్పారు.