నవతెలంగాణ మద్నూర్
ప్రజా పాలన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు మండల కేంద్రాల్లోని సమస్యలు పరిష్కరింప చేయడానికి ప్రతి సోమవారం తహశీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాలు చేపడుతూ వస్తోంది. సోమవారం నాడు జరిగిన మద్నూర్ తహశీల్దార్ కార్యాలయంలో ప్రజావాణికి అధికారులు పట్టింపు లేదు అనడానికి ఐదు శాఖల అధికారులు మాత్రమే హాజరు కావడమే నిదర్శనం. మండలంలో ఎన్నో శాఖలు ఉన్నాయి అలాంటి శాఖల అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కాకపోవడం అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వం పట్టించుకోవడం లేక ప్రజా సమస్యల పరిష్కారం ఏ విధంగా పరిష్కరింపబడతాయో ప్రజావాణిలో అధికారుల హాజరు చూస్తుంటే అర్థమవుతుందని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నాడు జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మండల తహసిల్దార్ అందుబాటులో లేనందున డిప్యూటీ తాసిల్దార్ శ్రీ రామకృష్ణ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాణి ఎంపీవో వెంకట, నరసయ్య, ఏవో రాజు, ఐకెపి శాఖ, వైద్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.



