నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. దీంతో చమురు ఎగుమతులు స్తంభించి ప్రపపంచంలో ఇంధన సంక్షోభం నెలకొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హర్మూజ్‌ను తెరవాలని గగ్గోలు పెడుతున్నారు. అయినా కానీ ఇరాన్ బెదరకుండా హర్మూజ్ జలసంధి గుండా చమురు నౌకల రాకపోకలపై నిషేధం విధించింది. ఈక్రమంలోనే ఇరాన్ మాజీ సర్వోన్నత నాయకుడు అలీ ఖమేనీకి సంతాపం తెలిపేందుకు ఆయన ప్రస్తుతం పాట్నాకు వచ్చారు. ఈ సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన కీలక వ్యాఖ్యలు. తమ శత్రు దేశాలకు, వారికి సహకరిస్తున్న పలు దేశాలకు మాత్రమే హర్మూజ్ జలసంధి గుండా అనుమతి లేదని, మిగిలిన దేశాల నౌకలు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫిగా రాకపోకలు సాగిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.
కేవలం శత్రు దేశాలకే హర్మూజ్ గుండా అనుమతి లేదు: ఇరాన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



