– అఖిల భారత రైతు.కూలీ సంఘం(ఏ ఐ కే ఎం ఎస్) జిల్లా అధ్యక్షులు కళ్లెపు అడవయ్య
నవతెలంగాణ-రాజపేట: భారత దోపిడీ పాలక వర్గాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక, బడా కార్పోరేట్,సామ్రాజ్యవాద అనుకూల విధానాలు,దోపిడీ, పిడన,అణిచివేత ల నుండి ప్రజలను మరిన్ని నక్సల్బరీ,శ్రీకాకుళం, గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాలు మాత్రమే విముక్తి చేస్తాయని అఖిల భారత రైతు.కూలీ సంఘం (ఏ ఐ కే ఎం ఎస్)యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కల్లెపు అడివయ్య స్పష్టం చేశారు.
బుధవారం రాజా పేట, సోమారం, లక్ష్మక్క పల్లి గ్రామాలలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో జరిగిన అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా రేగు శ్రీశైలం,బొమ్మకంటి శ్రీను,గిరిరాజు భిక్షపతి లు జండాలను ఎగురవేశారు.
అనంతరం జరిగిన సభలో అడివయ్య మాట్లాడుతూ,గత అయిదు దశాబ్దాలకు పైగా దేశంలో కమ్యూనిస్టు విప్లవ కారులు భూమి, బుక్తీ విముక్తి కోసం ప్రాణాలకు తెగించి,అనేక త్యాగాలు చేస్తూ, రాజ్యం చే తీవ్ర చిత్ర హింసలకు గురయి, జైళ్లలో మగ్గుతూ అనేక అవరోధాలు,ప్రతికూల పరిస్థితులలో కూడా ప్రజలే ప్రాణంగా వీరోచితంగా పోరాడారని చారు మజుందార్, కానుసైన్యాల్ , కొల్లా వెంకయ్య, తరిమెల నాగిరెడ్డి,దేవులపల్లి వెంకటేశ్వరరావు, సత్యనారాయణ సింగ్, పొట్ల రామనర్శయ్య,చండ్ర పుల్లారెడ్డి,నీలం రామచంద్రయ్య, జంపాల చంద్రశేఖర ప్రసాద్ తదితర వేలాది మంది వీరులు రక్తం చిందించారని వీరి త్యాగాల పునాదులపై నిర్మించిన పోరాటాల వల్ల ప్రజలు లక్షల ఎకరాల పంట భూములను స్వాధీనం చేసుకుని అనుభవిస్తున్నారని, నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరి లోయ ప్రతిఘటన,తదితర పోరాటాలే అన్ని వర్గాల ప్రజల ఈతి బాధలను పరిష్కరిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏ ఐ కే ఎం ఎస్ రాష్ట్ర అద్యక్షులు మామిడాల భిక్షపతి,సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్.జనార్ధన్,డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్, జిల్లా నాయకులు చిర బోయిన కొమురయ్య,మామిడాల బాల మల్లేష్, గుజ్జుల కిష్టారెడ్డి, ఎమ్మ బాలరాజు,దొంతి పుష్ప,దొంతి భిక్షపతి,దయ్యాల సిద్దులు,బొద్దుల మహేందర్,యెర్రగోకుల రంజిత్,మేక ఉపేందర్,జూకంటి చంద్రయ్య,పుప్పాల మల్లయ్య, కోయ బాబు, బండి సిద్దులు,కోజిగా వీరయ్య తదితరులు పాల్గొన్నారు.



