- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసిన సేవలు చిరస్థాయిగా గుర్తుండిపోతాయని సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాముగా కమలాకర్ అన్నారు. బుధవారం జన్నారం మండలం తహసీల్దార్ గా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేయుచున్న చిట్ల రాజమనోహర్ రెడ్డి ని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం నాయకులు గోపి సత్యనారాయణ, ఎల్. చందులాల్ తో కలిసి తహసీల్దార్ కార్యాలయం లో వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తహసీల్దార్ గా జన్నారం మండల ప్రజలకు ఉపాధ్యాయ ఉద్యోగులకు ముఖ్యంగా మండలంలోని విద్యార్థులకు ఎనలేని సేవలు చేసినందుకు వారిని అభినందించారు. వారి శేష జీవితం ఆనందంతో సుఖశాంతులతో గడపాలని కోరుకుంటున్నామన్నారు..
- Advertisement -



