నవతెలంగాణ – ఆలేరు
భారత ఎన్నికల కమిషన్ ఇష్టానుసారంగా ఓట్లను తొలగిస్తూ మోడీ ప్రభుత్వానికి జేబు సంస్థగా మారిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆరోపించారు. గురువారం రాత్రి యాదిగిరిగుట్ట పట్టణంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓట్ చొర్ మోడీ గద్దె చోడ్ నినాదాలు ఇస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అండ్ సంజీవరెడ్డి మాట్లాడుతూ.. బీహార్ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో బిజెపి పార్టీని గెలిపించేందుకే ఎన్నికల కమిషన్ 65 లక్షల మంది ఓటర్లను తొలగించిందని బ్రతికున్న వారిని వలస వెళ్లిన వారిని కాంగ్రెస్ బలంగా ఉండి గెలుపొందే నియోజకవర్గాల్లో ఓటర్లను అక్రమంగా తొలగించారు అన్నారు.
రాజ్యాంగ పరిరక్షణకు ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ రెండు వారాలుగా ఎన్నికల కమిషన్ చేసిన తప్పులను ఒక్కొక్కటి బయట పెట్టారని ఎన్నికల కమిషన్ వాటికి సమాధానం చెప్పకుండా వారు చెప్పినవన్నీ నిజాలు అంటూ అఫిడేవిట్ కావాలని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎన్నికల కమిషన్ ఒక రాజకీయ పార్టీలగా వ్యవహరిస్తుందన్నారు. ఎన్నికల కమిషన్ బిజెపి చేతుల్లో కీలుబొమ్మగా మారిందన్నారు. ఒకే వ్యక్తికి ఒకే ఓటు రాజ్యాంగ హక్కును రక్షించేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి, కౌన్సిలర్ మల్లేశం, శ్రీధర్ గౌడ్, ఆ పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.