- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: భారత్ -పాక్ సరిహద్దుల వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చార్‌ధామ్ యాత్రను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.హెలికాప్టర్ సేవలను కూడా నిలిపివేసింది. బద్రినాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. మే 4న త్తరాఖండ్ లోని బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకోగా, అంతకముందు రోజు అక్షయ తృతీయ నాడు గంగోత్రి, ఆ తర్వాత రోజు కేదార్‌నాథ్ ఆలయాలు తెరుచుకున్న విషయం తెలిసిందే. పాక్- ఇండియా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చార్‌థామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది.
- Advertisement -