Thursday, May 8, 2025
Homeరాష్ట్రీయంఉగ్రవాదానికి సమాధానమే ఆపరేషన్‌ సిందూర్‌

ఉగ్రవాదానికి సమాధానమే ఆపరేషన్‌ సిందూర్‌

- Advertisement -

– భారత సైన్యానికి సెల్యూట్‌ : బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

పాక్‌ ఉగ్రవాదానికి సమాధానమే ఆపరేషన్‌ సిందూర్‌ అని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్‌లోని మూడు ఉగ్రవాద సంస్ధలకు చెందిన తొమ్మిది శిబిరాల్లో దాక్కున్న టెర్రరిస్టులను పెద్దసంఖ్యలో హతమార్చిన భారత సైన్యానికి అభినందనలు తెలిపారు. పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదుల ఏరివేతకు భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్‌ను ప్రజలు గర్విస్తున్నారన్నారు. భారతీయులకు హాని తలపెట్టాలని చూసే దుష్ట శక్తులను మోడీ ప్రభుత్వం ఎట్టి పరిస్దితుల్లోనూ వదిలిపెట్టదనీ, వాటి అంతు చూస్తుందని ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా మరోమారు నిరూపితమైందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి, సైన్యానికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -