Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఆపరేషన్ సింధూర్..సీఎం రేవంత్ అత్యవసర సమీక్ష

ఆపరేషన్ సింధూర్..సీఎం రేవంత్ అత్యవసర సమీక్ష

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్ మెంట్, ఇతర సంబంధిత వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.
ఢిల్లీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సీఎం రేవంత్ ఫోన్ చేసి తక్షణమే బయలుదేరి హైదరాబాద్ రావాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో దేశరక్షణలో హైదరాబాద్ వ్యూహాత్మక ప్రాంతంగా, డిఫెన్స్ విభాగాలకు స్థావరంగా ఉన్నందున తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా అన్ని విభాగాలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే సాయంత్రం జరిగే మాక్ డ్రిల్ ను ఆయన స్వయంగా పర్యవేక్షించనున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad