Friday, May 16, 2025
Homeజాతీయంఆప‌రేష‌న్ సిందూర్ ట్రైల‌రే: రాజ్‌నాథ్ సింగ్‌

ఆప‌రేష‌న్ సిందూర్ ట్రైల‌రే: రాజ్‌నాథ్ సింగ్‌

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగియలేదని, ఈ ఆపరేషన్‌తో ట్రైలర్‌ మాత్రమే చూశారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ అన్నారు. భుజ్ ఎయిర్‌ఫోర్స్ స్టేష‌న్‌ను ఇవాళ రాజ్‌నాథ్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఎయిర్‌ వారియర్స్‌ తో మాట్లాడారు. సరైన సమయంలో ప్రపంచం మొత్తానికి పూర్తి సినిమా చూపిస్తామ‌ని అని వ్యాఖ్యానించారు. ‘పాకిస్థాన్‌ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో భారత్‌ 23 నిమిషాల్లోనే తుడిచిపెట్టేసింది. త్రివిధ దళాల పరాక్రమం చూసి యావత్‌ భారతావని గర్విస్తోంది. ఈ ఆపరేషన్‌తో భారత్‌ సైనిక సత్తా ప్రపంచ దేశాలకు తెలిసింది. పాక్‌లోని ప్రతి మూలకూ వెళ్లే సామర్థ్యం మన వైమానిక దళానికి ఉంది. ఆపరేషన్‌ సిందూర్‌తో అది నిరూపితమైంది. ఈ ఆపరేషన్‌తో మ‌న వైమానిక సామ‌ర్థ్యాన్ని పాక్‌ ప్రత్యక్షంగా చూసింది. పాకిస్థాన్ నేల‌పై ఉన్న 9 ఉగ్ర స్థావరాలను మ‌న మిలిట‌రీ ధ్వంసం చేసిన దృశ్యాల‌ను యావ‌త్ ప్రపంచం తిల‌కించింది. బ్రహ్మోస్ మిస్సైల్ శ‌క్తికి పాక్‌ వణికిపోయింది’ అని రాజ్‌నాథ్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -