నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్ – పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో కాల్పుల విరమణకు భారత్ – పాకిస్తాన్ అంగీకారానికి వచ్చాయని అన్నారు. పాక్‌తో కాల్పుల విరమణకు మాత్రమే తాము అంగీకరించామని.. ఉగ్రవాదంపై పోరులో ఎలాంటి మార్పు లేదని.. ఉగ్రవాదంపై భారత్ పోరు కొనసాగుతూనే ఉంటుందని కీలక ప్రకటన చేశారు. ఉగ్రవాదంపై భారత్ రాజీలేని పోరాటం చేస్తుందని అన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ అంతమొందించి తీరుతుందని తెలిపారు. ఈనెల 12వ తేదీన భారత్ – పాక్ మధ్య ప్రత్యక్ష చర్చలు ఉంటాయని.. ప్రత్యక్ష చర్చల తర్వాతే కాల్పుల విరమణపై ఇరు దేశాలు నిర్ణయం తీసుకుంటాయని అన్నారు. ముందుగా కాల్పుల విరమణకు పాకిస్తాన్ డీజీఎంవో ప్రతిపాదించారని.. ఆ తర్వాత చర్చలకు తాము అంగీకరించామని తెలిపారు. మరో అంశంపై కానీ, మరో ప్రదేశంలో కానీ చర్చించాలన్న నిర్ణయాలేమీ లేవని అన్నారు. అంతకుముందు భారత్- పాకిస్తాన్‌లు కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో శనివారం సాయంత్రం ఓ పోస్ట్ పెట్టారు. ‘‘అమెరికా మధ్యవర్తిత్వంలో రాత్రంతా సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. తక్షణమే కాల్పుల విరమణ చేపట్టేందుకు భారత్, పాక్ అంగీరించాయి. ఇరు దేశాలకు ధన్యవాదాలు’’ అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
కాల్పుల విరమణకు మాత్రమే ఒప్పందం.. దానికి కాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES