Tuesday, April 29, 2025
Homeబీజినెస్ OPPO F సిరీస్‌ : సరికొత్త F29 సిరీస్‌ను విడుదల

 OPPO F సిరీస్‌ : సరికొత్త F29 సిరీస్‌ను విడుదల

నవతెలంగాణ హైదరాబాద్: ప్రజాదరణ పొందిన తన ప్రసిద్ధ F సిరీస్ పరిణామ క్రమంతో అధిక-నాణ్యత, దీర్ఘకాలిక మన్నికను అందించే స్మార్ట్‌ఫోన్‌లను అందించడంలో OPPO India తన నిబద్ధతను బలోపేతం చేసుకుంటూనే ఉంది. దాని మన్నిక, ఫీచర్-రిచ్ పనితీరుకు గుర్తింపు దక్కించుకున్న F సిరీస్ భారతదేశంలో గణనీయంగా అభివృద్ధి చెందడంతో పాటు దేశవ్యాప్తంగా వినియోగదారుల నుంచి దృఢమైన దరణను సంపాదించుకుంది. 
            కొనసాగుతున్న ఆవిష్కరణలలో భాగంగా OPPO, మన్నికతో F సిరీస్ డిజైన్ ఫిలాసఫీకి ఒక మూలస్తంభంగా మారింది. బ్రాండ్ నిరంతరం రోజువారీ జీవితంలోని కఠినతలను తట్టుకునే స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేయడంపై దృష్టి సారించింది- నిర్మాణ సమగ్రతను మెరుగుపరచేందుకు ప్రీమియం పదార్థాలను ఉపయోగించడం, దుమ్ము మరియు నీటి నిరోధకత కోసం అత్యధిక IP రేటింగ్‌లను చేర్చడం ఇందులో ఉన్నాయి. ప్రమాదవశాత్తు పడిపోవడం, కఠినమైన వాతావరణం నుంచి రోజువారీ ప్రమాదవశాత్తు జరిగే ఘటనల వరకు, F సిరీస్ నమ్మకమైన సహచరుడిగా ఉండేలా రూపొందించారు. దీనిని ప్రతిబింబిస్తూ, OPPO F27 Pro+ విడుదలైన మొదటి ఆరు నెలల్లో OPPO F25 Pro కన్నా 30% ఎక్కువ విక్రయాలతో తన ముందు తరం ఉత్పత్తుల కన్నా మెరుగైన పనితీరును కనబరిచింది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే, F27 Pro+ అదే కాలంలో F25 Pro కన్నా 25% వృద్ధిని నమోదు చేసింది. ఈ డ్యూరబిలిటీ-ఫస్ట్ విధానం మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర వంటి కీలక ప్రాంతీయ మార్కెట్లలో డిమాండ్‌ను పెంచింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం, OPPO ఇప్పుడు నీరు మరియు ధూళి నిరోధకతకు అత్యంత ప్రాధాన్యత కలిగిన బ్రాండ్ – బ్రాండ్  మన్నిక ప్రమాణాలకు ఆమోదం లభించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img