Thursday, March 19, 2026
E-PAPER
Homeజిల్లాలుకొత్త పట్టాదారులకూ భరోసా.!

కొత్త పట్టాదారులకూ భరోసా.!

- Advertisement -

ఫిబ్రవరి 28 నాటికి పాస్ పుస్తకాలు పొందిన వారికి అవకాశం

దరఖాస్తుకు ఈ నెల 25వ తేదీ వరకు గడువు

నవతెలంగాణ-మల్హర్ రావు

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మరో తీపి కబురు చెప్పింది.ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ నాటికి కొత్త పట్టా పాస్పుస్త కాలు పొందిన రైతులు కూడా ‘రైతు భరోసా’ పథకం కింద పంట పెట్టుబడి సాయం పొందేందుకు అవకాశం కల్పించింది.ఈ మేరకు మార్గ దర్శకాలను విడుదల చేసిందని మండల వ్యవసాయాధికారి బొల్లపల్లి శ్రీజ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు తగిన పత్రాలతో స్థానిక రైతు వేదికల్లో ఏఈవోలకు ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఈ నిర్ణయంతో మండలంలో మరికొంత మంది రైతులు లబ్ధి పొందనున్నారు. కటాఫ్ తేదీ ప్రకారం మండలంలో కొత్త పట్టాదారు పుస్తకాలు పొందిన వారు దాదాపు రెండు వందల మంది ఉన్నట్లుగా తెలుస్తోంది.అయితే యాసంగి సీజన్ కు సంబంధించిన రైతు భరోసా నిధులు మార్చి 22వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

పాత రైతులతోపాటు కొత్త రైతులకు కూడా పెట్టుబడి సాయం అందనుంది. ఎకరానికి రూ.6వేల చొప్పున ప్రభుత్వం ఇవ్వనుంది.కొత్త పట్టాలు పొందిన రైతులు దరఖాస్తు చేసుకునేలా వ్యవసాయాధికారులు వాట్సాప్ గ్రూపుల్లో, స్టేటస్ల ద్వారా సమాచారాన్ని చేరవేస్తున్నారు. రైతు భరోసా నిధులను ప్రభుత్వం చివరిసారిగా 2025 వానాకాలంలో మండలంలో 9.391 వేల మంది రైతులకు రూ.12,98,50.000 కోట్లు ఖర్చు చేసింది.

అర్హతలు.. అవసరమైన పత్రాలు

ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు కొత్త పట్టా పాసుబుక్ పొందినవారు అర్హులు.పట్టా పాస్ బుక్ ఉండి ఇప్పటి వరకు రైతు భరోసా పొందని రైతులు.రైతు భరోసా అప్లికేషన్ ఫారం,పట్టాదార్ పాస్పుస్తకం జిరాక్స్,రైతు ఆధార్ కార్డు,బ్యాంకు ఖాతా జిరాక్స్,రైతు మొబైల్ నంబర్ ఇవ్వాలి.

సద్వినియోగం చేసుకోవాలి..

బొల్లపల్లి శ్రీజ….ఏవో

రాష్ట్ర ప్రభుత్వం కల్పిం చిన అవకాశాన్ని కటాఫ్ తేదీ వరకు కొత్త పట్టాపాస్ పుస్తకాలు పొందిన రైతులు సద్వినియోగం చేసుకోవాలి. యాసంగికి సంబంధించిన రైతు భరోసా డబ్బులు రావాలంటే కొత్త రైతులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. రైతుల్లో వేదికల్లో ఏఈవోలను సంప్రదిస్తే వారు మరిన్ని వివరాలు తెలుపుతారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -