Sunday, May 18, 2025
Homeసినిమాచిరు సరసన మూడోసారి..

చిరు సరసన మూడోసారి..

- Advertisement -

చిరంజీవి, దర్శకుడు అనిల్‌ రావిపూడి వంటి క్రేజీ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్‌తో ఈ చిత్రం అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్టైనర్‌గా ఉంటుందని తెలుస్తోంది. చాలా కాలం తర్వాత చిరంజీవి కంప్లీట్‌ హ్యుమరస్‌ రోల్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్‌బాక్స్‌ ఎంటర్టైన్మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. అర్చన సమర్పిస్తున్నారు. మ్యాసీవ్‌ ఎంటర్‌టైనర్స్‌ని క్రియేట్‌ చేయడంలో, వినూత్నమైన ప్రమోషన్లను రూపొందించడంలో పేరు పొందిన అనిల్‌ రావిపూడి మరోసారి తన మార్క్‌ చూపించారు. ఈ చిత్ర ప్రమోషన్స్‌కు తన సిగేచర్‌ టచ్‌, ఒరిజినాలిటీని తీసుకువస్తున్నారు. చిరంజీవికి జోడిగా నయనతారను హీరోయిన్‌గా పరిచయం చేయడానికి అనిల్‌ రావిపూడి న్యూ వీడియోను రిలీజ్‌ చేశారు.
ఈ వీడియోలో నయనతార తన టీంతో తెలుగులో మాట్లాడటం, కారు ప్రయాణంలో చిరంజీవి క్లాసిక్‌ పాటలు వినడం, స్క్రిప్ట్‌ను చదవడం, చిరు ఐకానిక్‌ డైలాగ్‌లలో ఒకదాన్ని చెప్పడం ఆకట్టుకుంది. ఫైనల్‌గా అనిల్‌ రావిపూడి ఆమెతో కలిసి న్యూస్‌ని అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశారు.
‘సైరా నరసింహారెడ్డి, గాడ్‌ఫాదర్‌’ తర్వాత చిరంజీవితో నయనతార మూడవ సారి కలిసి పనిచేస్తున్న చిత్రమిది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావడానికి టార్గెట్‌గా పెట్టుకున్నారు. కొత్త ప్రమోషనల్‌ వీడియో ద్వారా ‘సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం’ అని చెప్పడంతో మరోసారి రిలీజ్‌ని కన్‌ఫర్మ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -