Tuesday, February 24, 2026
E-PAPER
Homeజాతీయంప్ర‌ధాని మోడీకి ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ స‌వాల్

ప్ర‌ధాని మోడీకి ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ స‌వాల్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మ‌రోసారి యూఎస్ ట్రేడ్ డీల్‌పై మోడీ స‌ర్కార్ పై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ. ట్రంప్ ఒత్తిడి మేర‌కే ప్ర‌ధాని మోడీ స‌దురు ఒప్పందానికి ఒప్ప‌కున్నార‌ని, రాజీప‌డ్డార‌ని విమ‌ర్శించారు. మంగ‌ళ‌వారం మ‌ధ్య‌ప్ర‌దేశ్ భూపాల్ నిర్వ‌హించిన కిషాన్ కిసాన్ మహాచౌపాల్ స‌భ‌లో మాట్లాడారు. భార‌త్-అమెరికా ట్రేడ్ డీల్‌ను యూఎస్ సుప్రీంకోర్టు కొట్టి వేసింద‌ని, ఆ త‌ర్వాత పీఎం మోడీ ఆ డీల్‌పై మౌనంగా ఉన్నార‌ని మండిప‌డ్డారు.

అమెరికాకు భార‌త్‌ను ఆమ్మేశార‌ని, కేంద్రం భారతీయుల డేటాను అమెరికాకు అందిస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ, అమెరికాతో వాణిజ్య ఒప్పందం నాలుగు నెలలుగా నిలిచి, ఆక‌స్మాత్తుగా అమోదం పొందింద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అమెరికన్ కంపెనీలు తమ ఉత్పత్తులను ఇక్కడ అమ్మాలని భారత ప్రభుత్వం కోరుకోలేదు. భారతదేశ రైతులు, వ్యవసాయ కార్మికులు, చివరికి ప్రభుత్వం కూడా దీనిని కోరుకోలేదు.

‘అమెరికా సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత ఇతర దేశాలు ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి, కానీ ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారు. ఈ వేదిక నుండి నేను మోడీ జీని సవాలు చేస్తున్నాను, అమెరికా సుప్రీంకోర్టు ఈ ఒప్పందంపై తన తీర్పు ఇచ్చిన తర్వాత, అమెరికాతో ఒప్పందాన్ని రద్దు చేయండి. ట్రంప్ ఒత్తిడి కారణంగా ఆయన ఈ ఒప్పందాన్ని రద్దు చేయలేరు. భారతదేశంలో అత్యధిక జనాభా, అత్యధిక డేటా ఉంది. కానీ ప్రధాని మోదీ మన డేటా మొత్తాన్ని అమెరికాకు ఇచ్చారు.’ అని రాహుల్ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -