- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో రెండో రోజు కూడా వాయిదాల పర్వం కొనసాగుతుంది. సభ మొదలైన కాసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. పహల్గాం, ఆపరేషన్ సిందూర్ తో బీహార్ ఓటర్ల జాబితా సవరణ తదితర అంశాలపై ప్రధాని మోడీ స్పందించాలని డిమాండ్ చేస్తూ.. ప్రతిపక్షలు రెండోరోజూ లోక్‌సభ, రాజ్యసభలో విపక్షాల ఆందోళనకు దిగాయి. అలాగే వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాల పట్టు పట్టడంతో సభ మొత్తం గందరగోళంగా మారింది. దీంతో విపక్షాల ఆందోళనల మధ్య ఉభయసభలు వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.
- Advertisement -