Thursday, December 18, 2025
E-PAPER
Homeజాతీయంపార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో విప‌క్షాల ఆందోళ‌న

పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో విప‌క్షాల ఆందోళ‌న

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో విప‌క్షాలు ఆందోళ‌న బాట‌ప‌ట్టాయి.బుధవారం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని విబి-జి రామ్‌ జిగా కేంద్రం పేరు మారుస్తూ లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టి… ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే మెజార్టీతో ఆమోదింపజేసుకుంది. కేంద్రం తీసుకున్న ఈ చర్యను వ్యతిరేకిస్తూగురువారం ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు ఆవరణలోనే ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ రాసిన బ్యానర్‌ను, గాంధీజీ చిత్రపటాలను చేతబట్టి నిరసన చేపట్టారు. మహాత్మాగాంధీని అవమానపరచడాన్ని సహించమని నినాదాలు చేశారు. మోడీ ప్రభుత్వం పెరిగిపోతున్న మైనార్టీలపై దాడుల్ని కూడా ఖండిస్తున్నట్లు ప్రతిపక్ష ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు.

కాగా, ఈ నిరసనలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, డిఎంకె ఎంపి కనిమొళి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజరుసింగ్‌తోపాటు, పలువురు నేతలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -