Monday, March 9, 2026
E-PAPER
Homeజాతీయంపార్ల‌మెంట్ ఎదుట విప‌క్షాల ఆందోళ‌న‌

పార్ల‌మెంట్ ఎదుట విప‌క్షాల ఆందోళ‌న‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: రెండో విడ‌త పార్ల‌మెంట్ స‌మావేశాలు నేటి నుంచి మొద‌లైన విష‌యం తెలిసిందే. తొలి రోజే ప్ర‌తిప‌క్షాలు నిర‌స‌న బాట ప‌డ్టాయి. పార్ల‌మెంట్ మ‌క‌ర ద్వారం వ‌ద్ద విప‌క్షాల ఎంపీలు పెద్ద‌యోత్తున నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేట్టారు. ఇండియా బ్లాక్ కూట‌మి అగ్ర‌నేత‌లు ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ, మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే, వివిధ పార్టీల ఎంపీలు బ్యాన‌ర్లు చేత‌బూని ర్యాలీ తీశారు.”గల్ఫ్ మండుతోంది, చమురు షాక్. భారతీయులు చిక్కుకుపోయారు’ అని బ్యాన‌ర్‌పై రాసుకొచ్చారు. ఉభ‌య‌స‌భ‌ల్లో ప‌శ్చ‌మాసియా సంక్షోభంపై, భార‌త్ ఇంద‌న నిల్వ‌ల‌పై చ‌ర్చ జ‌ర‌గాల‌ని డిమాండ్ చేశారు. ప‌శ్చిమాసియా యుద్ధం కార‌ణంగా గ్యాస్ రేట్ల‌ను బీజేపీ ప్ర‌భుత్వం పెంచింది. అదే విధంగా పెట్రోల్, డీజిల్, ముడి చ‌మురు నిల్వ‌ల‌పై ముంద‌స్తు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోలేద‌ని విప‌క్షాలు మండిప‌డుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -