Wednesday, December 3, 2025
E-PAPER
Homeజాతీయంప్రతిపక్షాల ఆందోళనలు…సంచార్‌ సాథీకి బ్రేక్

ప్రతిపక్షాల ఆందోళనలు…సంచార్‌ సాథీకి బ్రేక్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ప్రతిపక్షాల ఆందోళనలతో ‘సంచార్‌ సాదీ’¸ యాప్‌పై కేంద్రం వెనక్కి తగ్గింది. అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో సంచార్‌ సాథీ యాప్‌ను ముందస్తుగా ఇన్‌స్టాల్‌ చేయాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. టెలికాం భద్రతకు ముప్పు కలిగించే నకిలీ లేదా తప్పుడు ఐఎంఇఐ నెంబర్‌లతో కూడిన హ్యాండ్‌సెట్‌ల గురించి వెల్లడిస్తూ.. 2026 మార్చి నుండి ఫోన్‌ తయారీ దారులు అన్ని పరికరాల్లో సైబర్‌ సెక్యూరిటీ యాప్‌ను ముందస్తుగా ఇన్‌స్టాల్‌ చేయాలని టెలికమ్యూనికేషన్ల శాఖ (డిఒటి) సోమవారం ఆదేశాన్ని జారీ చేసిన సంగతి తెలిసిందే.

గోప్యత, నిఘా సమస్యలపై ప్రతిపక్షాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి ఫ్రీ ఇన్‌స్టాలేషన్‌ అవసరాన్ని ఇకపై అమలు చేయబోమని ప్రకటించింది. ‘‘సంచార్‌ సాథీకి పెరుగుతున్న ఆమోదం దృష్ట్యా, మొబైల్‌ తయారీదారులకు ఫ్రీ-ఇన్‌స్టాలేషన్‌ను తప్పనిసరి చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది” అని ప్రకటనలో పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -