- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఎస్‌ఐఆర్‌పై చర్చ జరగాలని ఉభయ సభల్లోని ప్రతిపక్ష ఎంపీల నిరసనలతో పార్లమెంటు దద్దరిల్లింది. దీంతో నేడు లోక్‌సభ, రాజ్యసభలు మధ్యాహ్నం 2కి వాయిదా పడ్డాయి. జూలై 21న ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగడం లేదు. ఎంతో కీలకమైన ఎస్‌ఐఆర్‌పై చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో రోజూ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. ఎన్నికల్లో, ఓటర్ల లిస్టుల్లో మోసాలకు వ్యతిరేకంగా సోమవారం ఇడియా బ్లాక్‌లోని పార్టీల ఎంపీలు మార్చ్ నిర్వహించనున్నారు. పార్లమెంట్ భవనం నుంచి.. ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకూ ఈ మార్చ్ జరుగుతంది.
- Advertisement -