Tuesday, September 16, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్

హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ లో కూడా రాత్రి నుంచి వర్షం దంచికొడుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్రంలోని పలు జిల్లాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు రాష్ట్రంలోని 16 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

హైదరాబాద్ నగరానికి కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రాత్రి నుంచి నగరంలో నిరంతరాయంగా వర్షం పడుతుండటంతో పలు ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి. “ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దు” అని డాక్టర్ నాగరత్న సూచించారు. రేపు, ఎల్లుండి కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఆమె తెలిపారు.

హనుమకొండ, వరంగల్‌, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్‌, ములుగు, సిరిసిల్ల, జనగాం, మెదక్‌, వనపర్తి, కామారెడ్డి, నిర్మల్‌, నారాయణపేట్‌ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ నాగరత్న వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -