నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరాఖండ్‌లోని పర్వత ప్రాంతాల జిల్లాలకు భారత్ వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని IMD ముందస్తుగా హెచ్చరించింది. ఈక్రమంలో చార్‌ధామ్ యాత్రికులకు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచించారు. వాతావరణ మార్పులతో ఏదైనా విపత్కర పరిస్థితులు సంభవిస్తే 112 ఎమర్జీన్సీ నెంబర్‌కు యాత్రికులు కాల్ చేయాలని యాత్రికులకు పోలీసులు సూచించారు. అదే విధంగా హిమచల్ ప్రదేశ్ కూడా వానాలు పడనున్నాయని, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా IMD కీలక సూచనలు చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు భారీ ఈదురు గాలులు వీయనున్నాయని పేర్కొంది.
ఉత్తరాఖండ్‌లోని ఆ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్: IMD
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES