Wednesday, April 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆరోగ్యమైన పంట, గ్రామీణ అభివృద్ధికి ఆర్గానిక్ సూత్రాలు

ఆరోగ్యమైన పంట, గ్రామీణ అభివృద్ధికి ఆర్గానిక్ సూత్రాలు

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్ 
రైతులు భూమిని సారవంతం చేసేందుకు ఆర్గానిక్ వ్యవసాయం చేయడం ఉత్తమం అని నిపుణులు చిన్ని కృష్ణయ్య వివరించారు. ఈ రోజు జాగిర్యాల్ గ్రామంలో గ్రామ సర్పంచ్ గడల ప్రసాద్ ఆధ్వర్యంలో జాతీయ ఉత్తమ సేంద్రియ రైతు చిన్ని కృష్ణయ్య వచ్చి గ్రామంలో ఉన్న రైతులకు, విద్యార్థిని విద్యార్థులకు ఎక్కువగా పొలంలో కెమికల్స్ (పెస్టిసైడ్స్) వాడకం వలన భూమి సారం కోల్పోతోందని, అయితే రైతులు పెట్టుబడి ఖర్చు తగ్గించుకొని అధిక లాభాలు గడించడంతో పాటు భూమిని సారవంతం చేసేందుకు ఆర్గానిక్ వ్యవసాయం చేయడం ఉత్తమం అని, ఆర్గానిక్ పంటల వల్ల లాభాలు వాటి వల్ల కలిగే ప్రయోజనాలు, ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాల గురించి కొన్ని ప్రయోగాల ద్వారా రైతులకు, విద్యార్థులకు వివరించారు.

సమాచారాన్ని అందించి భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆర్గానిక్ పంటలను పెంపొందించాలని, వాటిని తినడం ద్వారా మంచి ఆరోగ్యవంతమైన సమాజాన్ని సృష్టించిన వారం అవుతామని అన్నారు. ఈ గ్రామ ప్రజలకు మరియు రైతులకు విద్యార్థులకు మంచి సమాచారాన్ని ఇచ్చి అందరిని మంచి మేలు రకమైనటువంటి వడ్లను పండించుకోవాలని  సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు, వి డి సి సభ్యులు, వార్డ్ మెంబర్స్, గ్రామ ప్రజలు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -