బెల్జియం గ్రాండ్‌ప్ర్రీలో మెరుపు విజయం
స్టావెలోట్ (బెల్జియం) : ఈ ఏడాది ఎఫ్1 ట్రాక్‌పై మెక్‌లారెన్ జోరు కొనసాగుతుంది. వరుస రేసుల్లో దుమ్మురేపుతున్న ఆస్కార్ పియాస్ట్రి ఈ సీజన్‌లో ఆరో టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఓవరాల్ డ్రైవర్ చాంపియన్‌షిప్ రేసులో ముందంజ వేశాడు. ఆదివారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రీలో ఆస్కార్ పియాస్ట్రి రరురరు సత్తా చూపించాడు. బెల్జియం గ్రాండ్‌ప్రీ 7.004కిమీ ట్రాక్‌పై 44 ల్యాప్‌లను ఒక గంట 25 నిమిషాల 22.601 సెకండ్లలో పూర్తి చేసిన ఆస్కార్ పియాస్ట్రి అగ్రస్థానంలో నిలిచాడు. మెక్‌లారెన్ మరో డ్రైవర్ ల్యాండో నోరిస్ (ఆస్ట్రేలియా) ఆస్కార్ రేసు ముగించిన 3.415 సెకండ్ల తర్వాత ఫినిషింగ్ లైన్‌ను దాటాడు. రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ నాల్గో స్థానంలో నిలువగా..ఫెరారీ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఏడో స్థానంలో నిలిచాడు. వర్షం కారణంగా రేసు గంటన్నరకు పైగా ఆలస్యంగా ఆరంభమైనా.. మెక్‌లారెన్ డ్రైవర్లు టాప్-2లో నిలిచి ఆ జట్టుకు డబుల్ ధమాకా అందించారు.
ఆస్కార్ పియాస్ట్రి సిక్సర్
- Advertisement -
- Advertisement -