– సింధు జలాల ఒప్పందంలో జోక్యం చేసుకోలేం : ప్రపంచ బ్యాంక్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ : సింధు నదీ జలాల ఒప్పందంలో తాము జోక్యం చేసుకోలేమని ప్రపంచ బ్యాంక్ స్పష్టం చేసింది. తమది కేవలం ఫెసిలిటేటర్ పాత్ర మాత్రమేనని తేల్చి చెప్పింది. ఈ ఒప్పందం విషయంలో భారత్, పాక్‌ల మధ్య ఒక సహాయకుడు లేదా మధ్యవర్తిత్వ పాత్ర తప్ప ప్రపంచ బ్యాంక్ మరే పాత్ర పోషించలేదని ప్రపంచ బ్యాంక్ అధ్య క్షుడు అజరు బంగా చెప్పారు. సింధు, జీలం, చీనాబ్ నదుల జలాలను పంచుకునేందుకు 1960లో ఈ ఒప్పం దంపై భారత్, పాక్‌లు సంతకాలు చేశాయి. ఏప్రిల్ 22న పహల్గాం దాడి నేపథ్యంలో భారత్ ఈ ఒపందాన్ని నిలుపు చేసింది. ఈ సమస్యను ప్రపంచ బ్యాంక్ ఎలా పరిష్క రిస్తుందనే విషయంలో మీడియాలో చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి, కానీ అవన్నీ అసత్యాలు, ప్రపంచ బ్యాంక్ కేవలం ఒక ఫెసిలిటేటర్ పాత్ర మాత్రమే పోషించగలదు, అంతకుమించి మరే పాత్ర వుండబోదని అజరు బంగాను ఉటంకిస్తూ పిఐబి ఎక్స్ పోస్టులో పేర్కొంది.
మాది మధ్యవర్తిత్వ పాత్రే..
- Advertisement -
- Advertisement -