Thursday, May 29, 2025
E-PAPER
Homeజాతీయంకమల్‌హాసన్ వ్యాఖ్య‌ల‌పై దుమారం..

కమల్‌హాసన్ వ్యాఖ్య‌ల‌పై దుమారం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కమల్‌హాసన్‌ నటించిన ‘థగ్‌ లైఫ్‌’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో కమల్‌ కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు మండిపడుతున్నాయి. తాజాగా కమల్‌ వ్యాఖ్యలపై బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షులు విజయేంద్ర యడ్యూరప్ప కమల్‌ వ్యాఖ్యలను తప్పుపట్టారు. కమల్‌ కన్నడ భాషను అవమానించార‌న్నారు. 6.5 కోట్ల కన్నడ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించార‌ని, కమల్‌ కన్నడ భాషను అవమానించినందుకు ఆయన బేషరతుగా క్షమాపనణ చెప్పాలని విజయేంద్ర యడ్యూరప్ప డిమాండ్‌ చేశారు. కమల్‌ కన్నడ భాషలో నటించి లాభాలు పొందుతార‌ని ఆరోపించారు. కానీ ఆయన తన మాతృభాష తమిళభాషను గౌరవించడం పేరుతో ఇతర భాషలను అవమానిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప్రత్యేకించి కళాకారులు ఏ భాషనైనా, సంస్కృతినైనా గౌరవించాల‌ని, కానీ కమల్‌ వైఖరి భిన్నంగా ఉంద‌ని విమ‌ర్శించారు. ఆయన మాతృభాష తమిళం పేరుతో.. కన్నడ భాషను, తన సహ నటుడు శివరాజ్‌కుమార్‌ను కూడా అవమానించేలా వ్యాఖ్యానించారు’ అని బీజేపీ ఎమ్మెల్యే విజేంద్ర యడ్యూరప్ప విమర్శించారు.

కాగా, ఇటీవల చెన్నైలో ‘థగ్‌లైఫ్‌’ మూవీ ఆడియో కార్యక్రమానికి కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ కూడా వచ్చారు. ఈ సందర్భంగా కమల్‌ ప్రసంగం మొదలుపెట్టేటప్పుడు.. నా జీవితం, నా కుటుంబం, తమిళ భాష అని చెప్పా. మీ భాష (కన్నడ) తమిళం నుంచే పుట్టింది. ఆ విధంగా మీరు భాగస్వామి అయ్యారు’ అని శివరాజ్‌కుమార్‌ను ఉద్దేశించి అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -