కథానాయిక సమంత నిర్మాతగా మారుతూ ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. ఈ చిత్రం నేడు (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. డిఫరెంట్ కామెడీ, హర్రర్ జోనర్‌లో ఈ చిత్రం అద్భుతంగా ఉందని సెన్సార్ బందం ప్రశంసలు కురిపించింది. ఈ చిత్రంలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి, వంశీధర్ గౌడ్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. వివేక్ సాగర్ ఆకర్షణీయమైన నేపథ్య సంగీతం, క్లింటన్ సెరెజో పాటలు స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. తన అభిరుచికి, ఆకర్షణీయమైన కథ చెప్పడంలో నిబద్ధతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సమంత ఈ చిత్రంతో నిర్మాణంలోకి ఒక ముఖ్యమైన అడుగు వేసింది. కొత్త వారిని ప్రోత్సహిస్తూ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో కొన్ని చోట్ల పెయిడ్ ప్రీమియర్లు వేసి ‘శుభం’ మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించారు. స్పెషల్ ప్రీమియర్ షోల నుంచి ఈ చిత్రానికి విశేషమైన స్పందన లభించింది అని చిత్ర యూనిట్ తెలిపింది.