- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జమ్మూ ప్రాంతంలో 30 మందికి పైగా పాకిస్థానీ ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాలు పేర్కొనడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్ర స్థావరాలు గుర్తించడానికి భద్రతా దళాలు కొండలు, అడవులు, మారుమూల లోయల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులను ట్రాక్ చేయడానికి డ్రోన్లు, థర్మల్ ఇమేజర్లు, గ్రౌండ్ సెన్సార్లను మోహరించినట్లు అధికారులు తెలిపారు. జమ్మూలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోవడంతో ఉగ్రవాదులపై నిరంతర నిఘా కోసం పర్వత ప్రాంతాల్లో తాత్కాలిక నిఘా స్థావరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
- Advertisement -



