Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయం6వేల‌పైగా యూఎస్ వీసాలు ర‌ద్దు

6వేల‌పైగా యూఎస్ వీసాలు ర‌ద్దు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సుమారు 6,000కు పైగా విద్యార్థుల వీసాలను అమెరికా విదేశాంగశాఖ రద్దు చేసినట్లు సీనియర్‌ అధికారి ఒకరు సోమవారం తెలిపారు. వలసచట్టం అమలు జాతీయ భద్రతా ఇబ్బందులను తగ్గించడం వంటి ప్రయత్నాల్లో భాగంగా వీసా రద్దు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. తీవ్రమైన నేరాలు, ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలు సహా అమెరికా చట్టాలను ఉల్లంఘించడం, ఎక్కువకాలం దేశంలో ఉండటం వంటి కారణాలతో ఈ వీసాలను తిరస్కరించినట్లు సమాచారం.

”ఫాక్స్‌ న్యూస్‌ కథనం ప్రకారం.. స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ 6,000 కంటే ఎక్కువ మంది విద్యార్థుల వీసాలను రద్దు చేసిందని ఫాక్స్‌ న్యూస్‌ కథనాన్ని మేము ధృవీకరించాము. వాటిలో అధిక భాగం దాడి, దోపిడీ, మద్యం లేదా మాదకద్రవ్యాలను వినియోగించి వాహనాలు నడపడం (డియుఐ), ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం వంటివి ఉన్నాయి” అని ఆ అధికారి చెప్పారు.

మొత్తం రద్దైన వీసాల్లో మూడింట రెండొంతులు నేరాలకు సంబంధించినవని అన్నారు. ఆ 6,000 వీసాల్లో సుమారు 4,000 సందర్శకుల చట్టాన్ని ఉల్లంఘించాయని ఆ అధికారి తెలిపారు. ఉగ్రవాదం మరియు భద్రతా కారణాలకు సంబంధించిన ఇమ్మిగ్రేషన్‌ మరియు జాతీయ భద్రతా చట్టంలోని విభాగాన్ని ఉటంకిస్తూ.. స్వల్ప సంఖ్య అయినప్పటికీ గణనీయంగా 200 నుండి 300 మధ్య వీసాలు ఐఎన్‌ఎ 3బి కింద రద్దు చేసినట్లు తెలిపారు. వీపాలు రద్దు చేయబడిన విద్యార్థులు ఏ దేశాలకు చెందినవారు, వారు ఇప్పటికీ అమెరికాలోనే ఉన్నారా అన్న వివరాలను ఆ అధికారి వెల్లడించలేదు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad