- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత పెరగడంతో, దేశ రాజధాని ఢిల్లీ, యూపీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత తగ్గి, నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై దాద్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని చక్రసైన్‌పూర్ గ్రామం సమీపంలో డజనుకు పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో మహిళతో సహా పలువురు గాయపడ్డారు. వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
- Advertisement -



