– అమెరికా రాయబార కార్యాలయం కీలక అడ్వైజరీ జారీ
వైట్‌హౌస్: నిర్దేశిత గడువు దాటి అమెరికాలో ఉంటున్నవారిని ఉద్దేశించి భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఈ అంశంలో ఉల్లంఘనకు పాల్పడితే కలిగే తీవ్ర పరిణామాలను స్పష్టంగా వెల్లడించింది. బహిష్కరణ ముప్పు తప్పదని, అదేవిధంగా భవిష్యత్తులో అమెరికాకు ప్రయాణంపై శాశ్వత నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఎంబసీ పోస్టు పెట్టింది. పర్యాటక, విద్యార్థి, వర్క్ పర్మిట్స్ సహా వివిధ వీసాలపై అమెరికాలో నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించి ఈ హెచ్చరిక చేసింది. అమెరికా ప్రయాణంపై నిషేధం పడితే.. భవిష్యత్తులో అక్కడ చదువు, వ ృత్తివ్యక్తిగత అవకాశాలపై గణనీయమైన ప్రభావం చూపనుంది . నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత ఏవైనా అనుకోని పరిస్థితుల కారణంగా దేశాన్ని వీడటంలో ఇబ్బందులు ఏర్పడితే.. చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోకుండా ఉండేందుకోసం యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్)ను సంప్రదించాలని అధికారులు సూచించారు.కాగా.. అమెరికాలో గడువుకు మించి ఉంటున్నవారు తక్షణమే దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని అక్కడి హౌమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం గతంలో హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. ”అమెరికాలో 30 రోజులకు నిబంధనలకు మించి నివసిస్తున్న వారు కచ్చితంగా ఫెడరల్ గవర్నమెంట్ వద్ద రిజిస్టర్ చేయించుకోవాలి. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే.. నేరం కింద పరిగణించి అపరాధ రుసుం, జైలు శిక్షలు విధిస్తారు.అందుకే ఇప్పుడే సొంతంగా వెళ్లిపోండి” అని గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ నిబంధనలు పాటించకపోతే తక్షణమే దేశం నుంచి పంపిచేస్తామని పేర్కొంది. అంతేకాదు.. ఫైనల్ ఆర్డర్ అందుకొన్న వారు ఒక్క రోజు అధికంగా ఉంటే రోజుకు 998 డాలర్లు ఫైన్, సొంతంగా వెళ్లిపోకపోతే 1,000 నుంచి 5000 డాలర్ల ఫైన్ విధించనున్నారు. జైలు శిక్షను కూడా విధించే అవకాశం ఉందని. వారికి భవిష్యత్తులో చట్టపరమైన మార్గంలో కూడా అమెరికాలోకి ప్రవేశం లభించదని చెప్పింది.దీంతో అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థులు, వారి కుటుంబాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
వీసా గడువు మించితే బహిష్కరణే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES