- Advertisement -
నవతెలంగాణ డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడి పండ్ల లోడుతో వెళ్తున్న ఓ లారీ డెహ్రాడూన్‌లోని రిస్పాన్ బ్రిడ్జిపై అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న మామిడి పండ్లు మొత్తం రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అది చూసిన జనం చిన్నా పెద్ద అని తేడా లేకుండా మామిడి పండ్ల కోసం ఎగబడ్డారు. అప్పటికే రోడ్డుపై ఉన్నవారే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇండ్లలో ఉన్నవారు కూడా బస్తాలు, బుట్టలతో ఘటనా స్థలానికి వచ్చి మామిడి పండ్లను దొరికినవారికి దొరికినన్ని ఎత్తుకెళ్లారు.
- Advertisement -