Sunday, May 4, 2025
Homeఅంతర్జాతీయంసింగ‌పూర్‌లో పీఏసీ విక్ట‌రీ..93కు 82స్థానాలు కైవ‌సం

సింగ‌పూర్‌లో పీఏసీ విక్ట‌రీ..93కు 82స్థానాలు కైవ‌సం

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సింగపూర్‌లో అధికార పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ (పీఏపీ) మరోసారి విజ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేసింది. శనివారం ఆ దేశంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని లారెన్స్‌ వాంగ్‌ నేతృత్వంలో భారీ గెలుపును సొంతం చేసుకుంది. దీంతో ప్రధానిగా మరోసారి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.పార్లమెంటులో మొత్తం 98 సీట్లుండగా 5 చోట్ల ఇప్పటికే పీఏపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఎన్నికలు జరిగిన 93 సీట్లలో 82 చోట్ల ఆ పార్టీ విక్ట‌రీ సాధించింది. మొత్తం 87 సీట్లను సొంతం చేసుకుంది. ప్రతిపక్ష వర్కర్స్‌ పార్టీ 10 సీట్లలో గెలిచింది. 66 ఏళ్లుగా సింగపూర్‌లో పీఏపీనే అధికారంలో కొనసాగుతోంది. అదేవిధంగా సింగ‌పూర్ ప్ర‌ధానికి ఇండియా పీఎం మోడీ శుభకాంక్ష‌లు తెలిపారు. భార‌త్-సింగ‌పూర్ మ‌ధ్య ద్వైపాక్షిక బంధాలు ధృడ‌మైనవ‌ని, వాంగ్ నేతృత్వంలో మ‌రోసారి ఇరుదేశాల మ‌ధ్య వ్యూహాత్మ‌క బంధం బ‌లోపేతం కావాల‌ని భార‌త్ ప్ర‌ధాని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -