నెల్లికుదురు పిఎసిఎస్ ఇన్చార్జి జై మనోహర్ రావు
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో నెల్లికుదురు పిఎసిఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు పిఎసిఎస్ ఇన్చార్జి మనోహర్ రావు తెలిపారు. బుధవారం గ్రామస్తులతో కలిసి పాండాలు నిర్వహించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో నిర్వహించే వారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రతి రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం కోరారు. కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు గిట్టుబాటు ధర వస్తుందని అన్నారు. వెంటనే కాంటాలు పెట్టి మిల్లర్లకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీఈవో యాదగిరి సిబ్బంది శ్రీనివాస్ నాగరాజు యాకయ్య నాయకులు మాజీ వైస్ ఎంపీపీ జెల్ల వెంకటేష్, పెరుమాండ్ల మల్లేశం, పెరుమాండ్ల శంకర్, తాళ్ల చిన్న ప్రభాకర్, తాళ్ల అనిత, ఓలాద్రి పావని, వేణు, యాకన్న , శ్రీపాల్ రెడ్డి, సతీష్ యాకన్న తోపాటు కొంతమంది పాల్గొన్నారు.
బికే పల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



