Thursday, October 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డోంగ్లీలో కొనసాగుతున్న వరిధాన్యం కొనుగోళ్ళు

డోంగ్లీలో కొనసాగుతున్న వరిధాన్యం కొనుగోళ్ళు

- Advertisement -

నవతెలంగాణ- మద్నూర్
డోంగ్లి సింగల్ విండో ఆధ్వర్యంలో మద్దతు ధర వరి ధాన్యం కొనుగోలు కొనసాగుతున్నాయి. సింగిల్ విండో ఆధ్వర్యంలో మూడు సెంటర్లుగా కొనుగోలు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. ప్రస్తుతం ఈలేగావ్ గ్రామ శివారు రైతుల వరి ధాన్యం కొనుగోలు ప్రారంభించారు. మిగిలిన రెండు సెంటర్లు ఒకటి మాదన్ ఇప్పర్గా, రెండోది సిర్పూర్, ఈ గ్రామాల పరిధిలో వరి ధాన్యం కోతలు ప్రస్తుతం ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి. అక్కడ కూడా త్వరలోనే సింగిల్ విండో ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని సింగిల్ విండో చైర్మన్ రామ్ పటేల్ సింగిల్ విండో కార్యదర్శి గంగాధర్ తెలిపారు.

ప్రభుత్వ ఆదేశాలనుసారంగా మూడు సెంటర్లు రైతులకు అనుకూలంగా పంట దిగుబడులు రాగానే కొనుగోలు అని ప్రారంభిస్తామని, ప్రస్తుతం ఇలేగం శివారు రైతుల పంట కొనుగోలు కొనసాగు ఇస్తున్నట్లు తెలిపారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరి ధాన్యం దళారులకు అమ్ముకోకుండా మోసాలకు గురికాకుండా ప్రభుత్వం కల్పించే మద్దతు ధర కేంద్రాల్లోని అమ్ముకొని సద్వినియోగం పరుచుకోవాలని తెలిపారు. మద్దతు ధరతో పాటు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ కూడా ఇస్తుందని రైతులు ప్రైవేటు దళారులకు పంటను అమ్ముకోకూడదని తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -