Saturday, April 11, 2026
E-PAPER
Homeనల్లగొండ‘సాయుధ పోరాట అజ్ఞాత వాసి పైలా వాసుదేవరావు’

‘సాయుధ పోరాట అజ్ఞాత వాసి పైలా వాసుదేవరావు’

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్: పైలా వాసుదేవరావు అమరత్వం పొందాడని,ఆదర్శ విప్లవ కమ్యూనిస్టుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచాడని సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్.జనార్ధన్ అన్నారు. ఆలేరు పట్టణంలో శనివారం సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ కార్యాలయంలో కామ్రేడ్ పైలా వాసుదేవరావు 16 వ వర్ధంతి ని ఘనంగా జరిపారు.రెండు నిమిషాలు మౌనం పాటించి, ఘనంగా నివాళులర్పించి, విప్లవ జోహార్లు తెలిపారు. ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ..కేంద్రంలో బీజేపీ మోడీ ప్రభుత్వం గడిచిన 12 సంవత్సరాల కాలంలో ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరించిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్దులు, వితంతువులు, వికలాంగులకు అదనంగా పెన్షన్ ను పెంచకుండా,కొత్త వారికి పెన్షన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని అన్నారు. బోగస్ రేషన్ కార్డుల ఏరివేత పేరుతో అర్హులకు నష్టం కలిగించే ప్రమాదం లేకపోలేదని, ఆసరా పెన్షన్ ఆర్ధిక భారాన్ని తగ్గించుకునే ఎత్తుగడలు ప్రభుత్వం వేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు కల్లెపు అడివయ్య, జిల్లా నాయకులు చిర బోయిన కొమురయ్య, ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు కల్లేపు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -