Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్పైసాబజార్ మొదటి రిటైల్ స్టోర్ గురుగ్రామ్‌లో ప్రారంభం

పైసాబజార్ మొదటి రిటైల్ స్టోర్ గురుగ్రామ్‌లో ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : భారతదేశంలో అతిపెద్ద క్రెడిట్ మార్కెట్‌ప్లేస్‌, ఉచిత క్రెడిట్ స్కోర్ ప్లాట్‌ఫారమ్ పైసాబజార్ గురుగ్రామ్‌లో మొదటి రిటైల్ స్టోర్‌ను ప్రారంభించింది. వివిధ వర్గాల ప్రజలకు సులభంగా క్రెడిట్ అందించడమే లక్ష్యంగా ఈ రిటైల్ స్టోర్‌ను తెరిచింది. రాబోయే రోజుల్లో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రముఖ మెట్రో నగరాల్లో వంద స్టోర్లను ప్రారంభించడానికి ప్రణాళికలు రచిస్తుంది. ఈ నెలలో ఢిల్లీ, నోయిడాల్లో స్టోర్లు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా పైసాబజార్ సీఈఓ సంతోష్ అగర్వాల్ మాట్లాడుతూ ఈ రిటైల్ స్టోర్లలో వినియోగదారులు వ్యాపార రుణాలు, వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు, క్రెడిట్ కార్డులు, ఇతర ఆఫర్లు కూడా పొందే అవకాశం కలదన్నారు. క్రెడిట్ ప్రొఫైల్ బలోపేతానికి నిపుణుల సలహాలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. టెక్నాలజీ వినియోగంలో సౌకర్యంగా లేని వినియోగదారులు  ఈ స్టోర్ల ద్వారా సమగ్ర సమాచారం పొందుతూ సులభంగా క్రెడిట్ నిర్ణయాలు తీసుకోవచ్చన్నారు.

     ఈ రిటైల్ స్టోర్ మాకు కొత్త వ్యాపార నమూనా అన్నారు. ఇది ఫిజికల్ అనుభవంలో ఉన్న ఆత్మీయతను, టెక్నాలజీ ఆధారిత సాఫ్ట్ అనుభవాన్ని కలుపుతుందన్నారు. ఫిజికల్ గా  వ్యాపారాన్ని విస్తరించడమే కాకుండా వినియోగదారుల నమ్మకాన్ని మరింత పెంచనున్నామని పేర్కొన్నారు. ఈ రిటైల్ స్టోర్ల ప్రారంభం పైసాబజార్ తీసుకున్న ఒక ముందడుగు అన్నారు. డిజిటల్ – ఫిజికల్ మధ్య ఉన్న అంతరాన్ని పూరించడంలో ఇవి సహాయపడతాయని తెలిపారు. చిన్న వ్యాపారులకు, మొదటిసారి రుణం తీసుకునే వారికి ఇవి ఉపయోగకరంగా ఉంటాయన్నారు. హైబ్రిడ్ డిస్ట్రిబ్యూషన్ మోడల్ను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. వ్యక్తిగత, ఆఫ్‌లైన్ వినియోగదారులకు చేరువవుతూ.. డిజిటల్ స్థాయిలో విస్తరించేందుకు ఇది తోడ్పడుతుందని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad