నవతెలంగాణ-హైదరాబాద్ : పాకిస్థాన్ వరుసగా ఆరో రోజు కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఏప్రిల్ 29-30 మధ్య రాత్రి పాక్ ఆర్మీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. జమ్మూకశ్మీర్‌లోని నౌషేరా, సుందర్‌బనీ, అఖ్నూర్ సెక్టార్లకు ఎదురుగా నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. పాక్ కవ్వింపు చర్యలకు భారత దళాలు దీటుగా బదులిచ్చాయి. పహల్గామ్ దాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అప్పటి నుంచి పాక్ ప్రతి రోజూ ఎల్‌వోసీ వెంబడి కాల్పులకు తెగబడుతూ భారత్‌ను రెచ్చగొడుతోంది.
మరోవైపు, పహల్గామ్ ఘటన నేపథ్యంలో పాక్‌పై సైనిక చర్యకు భారత్ సిద్ధమవుతోందని, ఈ విషయంలో తమకు కచ్చితమైన నిఘా వర్గాల సమాచారం ఉందని పాక్ మంత్రి అతావుల్లా తరార్ తెలిపారు. మరో 24-36 గంటల్లో భారత్ చర్యలు ఉండవచ్చని పేర్కొన్నారు. పహల్గామ్ దాడి విషయంలో భారత్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని, కల్పిత ఆరోపణలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాక్ కవ్వింపు చర్యలు..దీటుగా బదులిచ్చిన భారత్
- Advertisement -
RELATED ARTICLES