నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా పర్యటనలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు చేదు అనుభవం ఎదురైంది. వాషింగ్టన్‌లో మునీర్ ఉంటున్న హోటల్ ముందు పెద్ద ఎత్తున జనాలు గుమిగూడి, అతడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యానికి ఆసిమ్ మునీర్ అడ్డుగా ఉన్నాడని ఆరోపించారు. హోటల్ భవనం నుంచి పాక్ ఆర్మీ చీఫ్ బయటకు వెళ్తుండగా ప్రజలు ‘‘ఆసిమ్ మనీర్ ..సామూహిక హంతకుడివి, నువ్వు నియంత’’ అంటూ నినాదాలు చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అమెరికాతో సైనిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఐదు రోజుల అధికారిక పర్యటన కోసం మునీర్ ఆదివారం వాషింగ్టన్ వెళ్లినట్లు ఆ దేశ మీడియా చెబుతోంది.
యూఎస్‌లో పాక్ ఆర్మీ చీఫ్‌కు అవమానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES