Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంట్రంప్‌తో పాకిస్తాన్​ ఆర్మీచీఫ్​ భేటీ

ట్రంప్‌తో పాకిస్తాన్​ ఆర్మీచీఫ్​ భేటీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​.. పాకిస్తాన్​ ఆర్మీచీఫ్​ మార్షల్​ అసిమ్​ తో ఇవాళ ట్రంప్ భేట‌కానున్నారు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది భారత పౌరులు మరణించిన తర్వాత మునీర్ అమెరికాకు చేసిన మొదటి అధికారిక పర్యటన ఇది. మునీర్​ తన పర్యటనలో విదేశాంగ కార్యదర్శి మార్క్​ రుబియో.. రక్షణ కార్యదర్శి పీట్​ హెగ్సెలతో కూడా సమావేశం కానున్నారు.

అమెరికా ప‌ర్య‌ట‌న‌లో పాక్ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్ మునీర్‌కు మంగ‌ళ‌వారం చేదు అనుభ‌వం ఎదురైంది. వాషింగ్టన్‌లో మునీర్ ఉంటున్న హోటల్ ముందు పెద్ద ఎత్తున జనాలు గుమిగూడి, అతడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యానికి ఆసిమ్ మునీర్ అడ్డుగా ఉన్నాడని ఆరోపించారు. హోటల్ భవనం నుంచి పాక్ ఆర్మీ చీఫ్ బయటకు వెళ్తుండగా ప్రజలు ‘‘ఆసిమ్ మనీర్ ..సామూహిక హంతకుడివి, నువ్వు నియంత’’ అంటూ నినాదాలు చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad