- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఖైబర్ ఫక్తునఖ్వా ప్రావిన్సులో ఓ గ్రామంపై పాకిస్థాన్ వైమానిక దళం దాడి చేసింది. ఆ దాడిలో సుమారు 30 మంది గ్రామస్థులు మరణించినట్లు తెలుస్తోంది. సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ అటాక్ జరిగినట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. పాకిస్థాన్ యుద్ధ విమానాలు 8 ఎల్ఎస్-6 బాంబులను తిరహ్ లోయలో ఉన్న మాత్రే దారా గ్రామంపై జార విడిచింది. ఆ బాంబుల వల్ల భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అనేక మంది గాయపడినట్లు స్థానిక మీడియా పేర్కొన్నారు.
- Advertisement -