నవతెలంగాణ-హైదరాబాద్: ఆఫ్ఘనిస్థాన్‌పై మరోసారి పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 10 మంది చనిపోగా.. నలుగురు గాయపడినట్లుగా ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం రాత్రి 12 గంటల సమయంలో ఖోస్ట్ ప్రావిన్స్‌లోని గోర్బుజ్ జిల్లాలో దాడి జరిగినట్లుగా ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మంగళవారం తెలిపారు. 9 మంది పిల్లలు చనిపోయినట్లుగా పేర్కొన్నారు. అనంతరం చికిత్స పొందుతూ మహిళ కూడా చనిపోయినట్లుగా వెల్లడించారు. మొత్తంగా 10 మంది చనిపోయినట్లు తెలిపారు.
గత కొద్ది రోజులుగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంతో చర్చలు జరిగాయి. కానీ ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక ఈ మధ్య ఆప్ఘనిస్థాన్.. భారత్‌తో సఖ్యతగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆప్ఘనిస్థాన్‌పై వైమానిక దాడులకు పాల్పడుతున్నట్లు కనిపిస్తోంది.



