నవతెలంగాణ-హైదరాబాద్: మరోసారి పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్‌పై దాడి చేసింది.పాక్టికా ప్రావిన్స్‌లోని బర్మల్ జిల్లాపై జరిగిన దాడిలో పాకిస్తాన్ వైమానిక దళం ఒక మతపరమైన సెమినరీని లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రాథమిక వార్తల నివేదికలు పేర్కొన్నాయి. పాకిస్థాన్‌కు చెందిన ఫైటర్ జెట్‌లు నంగర్‌హార్ ప్రావిన్స్‌లోని ఖోగ్యాని జిల్లాపై కూడా అనేక వైమానిక దాడులు నిర్వహించాయని టోలో న్యూస్ నివేదించింది. పాకిస్తాన్ శనివారం నుండి పాక్టికాలోని బెర్మల్-అర్గున్‌లతో పాటు నంగర్‌హార్‌లోని ఖోగ్యాని, బహ్సోద్, ఘని ఖేల్ జిల్లాల్లో అనేక దాడులు నిర్వహించిందని టోలో న్యూస్ నివేదించింది. పాకిస్తాన్ మీడియా వర్గాలు కూడా ఇస్లామాబాద్ వైమానిక దాడులను ధృవీకరించాయి. పాక్-ఆప్ఘాన్ సరిహద్దులో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై ఈ దాడులు కేంద్రీకృతమై ఉన్నాయని వారు కథనాలు వెల్లడించారు.
మరోసారి ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



