- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: జైసల్మేర్ టార్గెట్‌గా పాక్ దాడులకు పాల్పడుతోంది. దీంతో అధికారులు, భద్రతాదళాలు అప్రమత్తమై జైసల్మేర్‌లోని ప్రజలను ఉదయం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పోలీసులు, ఆర్మీ సిబ్బంది కలిసి జైసల్మేర్‌ను ఖాళీ చేయిస్తున్నారు. ప్రజలెవరూ బయటకు రావొద్దని, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఒక్కరు కూడా బయటకు రావొద్దని ఆర్మీ ఆదేశాలు జారి చేసింది. దీంతో జైసల్మేర్ ప్రధాన రహదారులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కాగా జైసల్మేర్‌కు 6కి.మీ పరిధిలో ఉన్న గిడా గ్రామంలో పాక్ ప్రయోగించిన మిస్సైల్స్‌ను భద్రతాదళాలు కూల్చివేశాయి.
- Advertisement -